ఓ యువకుడు చేసిన పనికి ఉరేసుకున్న మైనర్ బాలిక

ప్రేమ వ్యవహారం 16 ఏళ్ల బాలిక ప్రాణాల్ని తీసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నా…? నా ప్రేమను ఒప్పుకో లేదంటే ప్రాణం తీసుకుంటానన్న వ్యక్తితో సన్నిహితంగా మెలగడమే ఆ బాలిక చేసిన తప్పు. దీన్ని అదునుగా భావించిన ప్రియుడు బాలికను మోసం చేశాడు. ఆ మోసాన్ని తట్టుకోలేని బాధితురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

గుజరాత్ అలహదాబాద్ కు  చెందిన బాలిక (16)ను ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటు వెంటబడ్డాడు. కాదనడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పాపం నిందితుడు బెదిరింపులకు భయపడ్డ బాలిక ప్రేమించేందుకు ఒప్పుకుంది.

ఈ నేపథ్యంలో ప్రేమికుడు దారుణానికి ఒడిగట్టాడు.  ఇద్దరు గడిపిన క్షణాల్ని రహస్యంగా కెమెరాలో బంధించాడు. ఆ వీడియోల్ని బాధితురాలికి తెలియకుండా నిందితుడు తనస్నేహితులకు షేర్ చేశాడు. అంతే ఆ వీడియోల వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలిక తల్లి తండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు.

ఓ వైపు ఎంతగానో ప్రేమించిన ప్రేమికుడు మోసం చేయడం, తల్లిదండ్రుల పరువు పోవడం, వీడియోల గురించి ప్రతీ ఒక్కరూ మాట్లాడుకోవడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

బాలిక ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతికి కారణమైన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Latest Updates