శభాష్ పిల్లలు : కారు అద్దాలు పగలగొట్టి బాలికను కాపాడారు

వైజాగ్ : కామాంధుడి చేతిలో ముక్కుపచ్చలారని పదేళ్ల బాలిక జీవితం పాడు కాపాడి భేష్ అనిపించుకున్నా పిల్లలు. పదేళ్ల బాలికపై రాజేశ్ అనే యువకుడు కారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఇది గమనించిన బాలిక తోటి ప్రెండ్స్ (10ఏళ్ల లోపు పిల్లలు) రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టారు. పెద్దగా కేకలు వేస్తూ..కాపాడండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో రాజేశ్ పరారీ అయ్యాడు. ఈ సంఘటన ఈ నెల-27న వైజాగ్ లో జరుగగా ఆలస్యంగా తెలిసింది.

భూపేష్‌ నగర్‌ కు చెందిన ఓ బాలిక సైకిల్ నేర్చుకుంటుండగా..అదే ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. సైకిల్ నేర్పిస్తానంటూ బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి ఎత్తుకుపోయి కారులో అత్యాచారం చేయబోయాడు. బాలిక అరుపులు విని అక్కడ ఆడుకుంటున్న పిల్లలు సాహసంతో కారు అద్దాలపైకి రాళ్లు విసిరారు. అయినా డోర్ ఓపెన్ చేయకపోవడంతో పిల్లలు గట్టిగా అరిచారు. పిల్లల కేకలు విని స్థానికులు రావడాన్ని గమనించిన రాజేష్ పరారీ అయ్యాడు.

బాలికను సేవ్ చేసిన పిల్లలు.. ఇంటికి తీసుకెళ్లి జరిగిన విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలిపారు. గురువారం బాలిక తల్లిదండ్రులు మహిళా చేతన సంస్థ సహకారంతో పోలీసు స్టేషన్​ లో ఫిర్యాదు చేశారు. అయితే సరైన సమయానికి పిల్లలు సాహసంతో బాలికను కాపాడారని వారిని అభినందించారు పోలీసులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు..  పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. గాయాలైన బాలికను KGH హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

Latest Updates