మీ బీపీ కంట్రోల్ మీ చేతుల్లోనే..

ఈ కాలంలో బీపీతో బాధపడేవాళ్లు చాలామందే ఉంటారు.  రోజూవారీ పనులతో పాటు, వారికుండే టెన్షన్సతో కూడా బీపీని కొనితెచ్చుకుంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. అది హైబీపీ అయినా కావొచ్చు లేదా లోబీపీ అయినా కావొచ్చు. బీపీ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రతిరోజూ బీపీ గోలీ పడందే చాలామంది నిద్రకు కూడా ఉపక్రమించరు. మరి అటువంటి బీపీని ఎలా కంట్రోల్లోకి తెచ్చకోవాలో చూద్దాం…

మనం ప్రతిరోజూ చేసే స్నానంతో కూడా బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే అందుకోసం ఎలాంటి స్నానం చేయాలన్నదే మనం తెలుసుకోవాల్సింది. ప్రతిరోజూ మనం చేసే మాములు స్నానం కాకుండా ఆవిరి స్నానం చేస్తే బీపీని అదుపులో పెట్టుకోవచ్చట. వారానికి 2 నుంచి 3సార్లు ఆవిరి స్నానం చేస్తే 25 శాతం మరియు 4 నుంచి 7 సార్లు చేస్తే 45 శాతం బీపీ అదుపులోకి వస్తుందట.

బీపీ అదుపులో ఉండాలంటే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం శరీరానికి ఎంతో అవసరం. ఇవన్నీ అంజీర పండులో చాలా ఎక్కువగా ఉంటాయి. అంజీర పండ్లు తినడం వల్ల వాటిలో ఉండే కాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు క్రమంగా ఆకలిని తగ్గిస్తాయి. దాంతో బరువును కూడా తగ్గించుకోవచ్చు.

రోజూవారీ పనుల వల్ల చాలామంది బీపీకి లోనవుతుంటారు. అలాంటప్పుడు చెర్రీ జ్యూస్ తాగితే వీలైనంత తొందరగా బీపీ అదుపులోకి వస్తుంది. బీపీని నియంత్రించడంలో చెర్రీ జ్యూస్ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ఈ కాలంలో మార్కెట్లో నారింజ పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతాయి. వీటిని సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను తిన్నా లేదా జ్యూస్ తాగినా బీపీ అదుపులోకి వస్తుంది.

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి ఘాటు వల్ల కళ్లలో నీళ్లు రావొచ్చు కానీ, బీపీని మాత్రం సులువుగా అదుపులో ఉంచగల శక్తి ఉల్లికి చాలా ఉంది.

బీట్ రూట్ ని చాలామంది తినడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్లు దాని జ్యూస్  రోజుకు రెండు సార్లు తాగినా బీపీ సులువగా కంట్రోల్ అవుతుంది.

కొబ్బరినూనెతో కూడా బీపీ కంట్రోల్ చేయవచ్చు. అదేలాగంటే కొబ్బరినూనెతో వంటలు చేసుకొని తినాలి. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. ఈ రెండూ చేస్తేనే బీపీ కంట్రోల్ అవుతుంది.

Latest Updates