బ్రాహ్మణ పరిషత్ అప్లికేషన్లకు 31 వరకు గడువు

పేద బ్రహ్మణ విద్యార్ధులు, యువకులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏర్పాటైన స్కీమ్ లకు అప్లికేషన్స్ ఈ నెల 31 వరకు ఇవ్వవచ్చని బ్రహ్మణ పరిషత్ తెలిపింది. ఈ నెల 20 నాటికి ఈ గడువు ముగుస్తున్నప్పటికీ దానిని 31 తేదీ వరకు పొడగిస్తున్నట్లు బ్రాహ్మణ పరిషత్ అడ్మినిస్ట్రేటర్ రఘురామశర్మ గురువారం ప్రకటించారు. వివేకానంద విదేశీ విద్యా పథకం, బెస్ట్ స్కీమ్ , రామానుజ ఫీజు రియింబర్స్ మెంట్ స్కీమ్ ల కింద ఏటా పేద బ్రాహ్మణ విద్యార్ధులకు బ్రాహ్మణ పరిషత్ ఆర్ధిక సహాయం అందిస్తోంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రఘురామశర్మ సూచించారు.

Latest Updates