బ్రహ్మోస్‌‌ సూపర్ సోనిక్ మిసైల్‌‌ ప్రయోగం విజయవంతం‌‌

న్యూఢిల్లీ: డిఫెన్స్ రంగంలో భారత్ మరో మైలురాయిని సాధించింది. డీఆర్‌‌డీవో రూపొందించిన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌‌ ప్రయోగం సక్సెస్ అయ్యింది. విధ్వంసక మిసైల్‌‌ను ఐఎన్‌‌ఎస్ చెన్నై యుద్ధ నౌక నుంచి సక్సెస్‌‌ఫుల్‌‌గా ప్రయోగించినట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌‌డీవో) ఓ ప్రకటనలో తెలిపింది. అరేబియా మహాసముద్రంలోని నిర్దేశిత టార్గెట్‌‌ను ఈ మిసైల్ కచ్చితత్వంతో ఛేదించినట్లు డీఆర్‌‌డీవో ట్విట్టర్‌‌‌లో వెల్లడించింది. భారత్ అమ్ములపొదిలో కీలకమైన బ్రహ్మోస్ సామర్థ్యాన్ని పెంచడంపై డీఆర్‌‌డీవో దృష్టి సారించింది.

Latest Updates