బ్రెయిన్ ఫీవర్ వ్యాధితో 10 రోజుల్లో 53 మంది చిన్నారులు మృతి

బీహార్ లో మెదడు వాపు (బ్రెయిన్ ఫీవర్) వ్యాధి చిన్నారుల పాలిట మృత్యువులా వెంటాడుతుంది. వ్యాధిబారిన పడి రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల్లో 53 మంది చనిపోగా..  48గంటల్లోనే 36మంది చిన్నారులు కన్నుమూశారు. మరో 133మంది చిన్నారులు హస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ చిన్నారుల్లో ఎక్కువశాతం మంది రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయి చనిపోయినట్లు చెబుతున్నారు డాక్టర్లు.  ఇలా రెండు రోజుల్లో ఇంత మంది చిన్నారలు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

రాష్ట్రంలోని పలు ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులన్నీ మెదడువాపు లక్షణాలున్న చిన్నారులతో నిండిపోయాయి. అధిక ఉష్ణోగ్రతతో జ్వరం రావడం, మానసిక ఆందోళన, తరచుగా ఉద్వేగానికి లోనవడం, కోమా వంటికి ఈ వ్యాధి లక్షణాలు. ఇందులో చాలా మంది పిల్లలు మారుమూల గ్రామాలకు చెందిన వారేనని చెబుతున్నారు. వేసవి కాలం వస్తే మెదడువాపు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు సీరియస్ అవుతున్నారు.  ఈ ఘటనపై ఇప్పటి వరకు బీహార్ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు చిన్నారుల తల్లిదండ్రులు.

Latest Updates