క‌రోనా స‌మ‌యంలో బ్రెయిన్ స్టోక్ కేసులు : స‌రైన స‌మ‌యంలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటున్న డాక్ట‌ర్లు

సమయానికి చికిత్స చేయించుకోకపోవడం వ‌ల్ల బ్రెయిన్ స్టోక్ కేసులు పెరుగుతున్నాయ‌ని మెడికవర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ సీమాంచల్ మిశ్రా అన్నారు.

క‌రోనా స‌మ‌యంలో బ్రెయిన్ స్టోక్ కేసులు న‌మోదవుతున్నాయి. అయితే స‌రైన స‌మ‌యంలో ట్రీట్మెంట్ తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే కేసులు న‌మోదువుతున్నాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఇటీవల ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసిన ఒక 45 ఏళ్ల వ్యక్తికి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తాయి. అత్య‌వ‌స‌ర చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ప‌లు టెస్ట్ లు చేసిన డాక్ట‌ర్లు ‘బ్రెయిన్ స్ట్రోక్’ వచ్చిందని గుర్తించారు. వెంటనే చికిత్స చేసి, పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత ఇంటికి పంపిన‌ట్లు మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా న్యూరాలజిస్టు డాక్టర్ సీమాంచల్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాపించిన ఈ తరుణంలో పరిస్థితి చాలా విషమించిన తర్వాతే రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. ‘బ్రెయిన్ స్ట్రోక్’ వచ్చినప్పుడు సరైన సమయానికి చికిత్స అందించినప్పుడే వాళ్ల ప్రాణాలను కాపాడగలం. నేరుగా రోగిని చూడకుండా వాళ్లకు సరైన మందులు ఇవ్వలేం. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగికి ఐవీ ఇంజెక్షన్ రూపంలో ‘‘టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివీటర్ (టీపీఏ)’’ ఇవ్వాలి.

స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4-5 గంటలను గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ సమయంలోనే ఈ ఇంజెక్షన్ ఇస్తే వాళ్ల ప్రాణాలు కాపాడగలం. అందువల్ల, ఏదైనా ఆరోగ్య సమస్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమయం వృథా చేయకుండా తగిన వైద్యం పొందడం చాలా ముఖ్యమ‌ని మెడికవర్ ఆసుపత్రుల కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ సీమాంచల్ మిశ్రా అన్నారు. తెలిపారు.

Latest Updates