ప్రాణాలకి తెగించి బామ్మను కాపాడిన సాహసబాలుడు

హర్యానా ‌: ఓ బాలుడు చేసిన సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన బామ్మను ఎద్దు పొడుస్తుండగా ప్రాణానికి తెగించా ఆమెను కాపాడి సాహస బాలుడు అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొటుతుండగా.. బాలుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాలు:

ఓ వృద్ధురాలు వీధిలో నడుచుకుంటూ వెళ్తుం ది. అదే వీధిలో తిరుగుతున్న ఎద్దు ఆమె దగ్గరకు రాగానే ఒక్కసారిగా దాడి చేసింది. ఇది గమనించిన ఆమె మనవడు పరుగెత్తుకొని వచ్చాడు. అతడిపైనా ఎద్దు దాడిచేసింది. అయినా బెదరకుండా అమ్మమ్మను పక్కకు తీసుకెళ్లాడు. అయినా అది విడవకుండా వారిపై దాడిచేసింది. అయినా బాలుడు అమ్మమ్మకు అడ్డుగా నిలిచి రక్షించుకున్నాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు ఎద్దును వెళ్లగొట్టారు.

ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని మహేంద్రగఢ్‌ లో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డట్లు స్థానిక మీడియా తెలిపింది. దీన్ని అక్కడే ఉన్నవారు వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అయ్యింది. ట్విట్టర్‌ లో ఈ వీడియోను 5 లక్షలకుపైగా వీక్షించారు. బాలుడి సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు.

Latest Updates