గచ్చిబౌలిలో MMA ఫైటింగ్‌‌‌‌కు రెడీ

హైదరాబాద్, వెలుగు మిక్స్‌‌‌‌డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రేమికులకు పండుగ వచ్చింది. గతేడాది  ‘బ్రేవ్ 20’ అంటూ నగరవాసులను ఆకట్టుకున్న అంతర్జాతీయ శ్రేణి ఫైటర్లు మరోమారు నగరానికి వచ్చారు. ‘బ్రేవ్ 30’ అంటూ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో శనివారం నుంచి పోటీలకు సిద్ధమయ్యారు. 12 దేశాలకు చెందిన 24 మంది ఫైటర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.12 విభిన్నమైన వెయిట్ విభాగాలతో పాటుగా రెండు మెయిన్ కార్డ్స్‌‌‌‌తో 12 బౌట్లు గా ఈ బ్రేవ్ 30 పోటీ జరగనుంది. అంతర్జాతీయ శ్రేణి ఫైటర్స్‌‌‌‌తో పాటుగా భారతీయ ఫైటర్లు కూడా పోటీపడబోతున్నారు. ఫైట్ నైట్‌‌‌‌లో టైటిల్ కోసం స్టెఫాన్ లోమన్ – లూయీ సానౌడకిస్ పోటీపడనుండగా, ఇండియాకు చెందిన కాంతరాజ్ అగాసా– జోర్డానియన్ ఫైటర్ నవ్రాస్ అబ్జాక్, మారియా రిబీరో, నెల్సన్ పీస్, భాబజీత్ వంటి వారు నెర్వ్ వ్రెకర్ పోటీలో పోటీపడనున్నారు. బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సిరీస్‌‌‌‌లో భాగంగా ఈ పోటీలను ఇప్పుడు హైదరాబాద్‌‌‌‌లో నిర్వహిస్తోంది  ఈసందర్భంగా బ్రేవ్ 30 గురించి మెర్క్యురీ స్పోర్ట్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ఎల్ఎల్‌‌‌‌పీ ప్రమోటర్ అక్బర్ రషీద్ మాట్లాడుతూ భారతదేశంలో అంతర్జాతీయ శ్రేణి క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు మెర్క్యురీ స్పోర్ట్స్ కట్టుబడి ఉందన్నారు.ఈ పోటీల  కోసం విస్తృతశ్రేణిలో అన్వేషణ జరిపి ఫైటర్లను గుర్తించిన తరువాత వాస్తవ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

Latest Updates