భయపడుతూ ఎంజాయ్ చేయాలంటే ఈ పార్కుకు వెళ్లాల్సిందే

సావో పాలో: భయపడుతూ ఎంజాయ్ చేయాలంటే బ్రెజిల్ లోని హోపి హరి హారర్ థీమ్ అమ్యూజ్ మెంట్ పార్క్ కు వెళ్లాల్సిందే. ఈ పార్క్ లో కారులో వెళ్తుంటే అనూహ్యంగా ఓ మలుపు దగ్గర రక్త పిశాచులు, మరో మలుపులో మంత్రగత్తెలు, దెయ్యాలు మిమ్మల్ని భయపెడతాయి. సైడ్ వాక్ కు వెళ్తే బాధితురాలిని మింగేయడానికి చూస్తున్న జాంబీస్ బెదిరిస్తాయి. అయితే వాళ్లందరూ మేకప్ వేసుకుని ఉన్న యాక్టర్స్ కావడం గమనార్హం. కరోనా లాక్ డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా ఈ పార్క్ ను మూసేశారు.

రీసెంట్ గా దీన్ని మళ్లీ తెరిచారు. దీంతో డ్రైవ్ చేసుకుంటూ దెయ్యాలు, భూతాలను చూస్తే థ్రిల్ అయ్యే చాన్స్ దొరికింది. ఈ అవకాశాన్ని వినియోగించుకన్న ప్రజలు స్కేరీ ఎంటర్ టైన్ మెంట్ కోసం పార్క్ కు తరలి వస్తున్నారు. కరోనా వ్యాప్తి భయం నేపథ్యంలో కార్లలో నుంచి బయటికి రాకుండా పార్క్ ను సందర్శిస్తున్నారు. 2.7 కిలో మీటర్ల ఈ సరదా టూర్ పూర్తవడానికి సుమారు 30 నిమిషాలు పడుతుంది. ఏడు ముఖ్యమైన అట్రాక్టివ్ ప్లేసెస్ లో వింత క్యారెక్టర్స్ ను చూస్తూ వెళ్లొచ్చు. ది ఎగ్జారిస్ట్ లాంటి హారర్ మూవీస్ ను ఇక్కడ రీప్రొడక్షన్ చేయడం విశేషం.

Latest Updates