రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు

భారత రిపబ్లిక్ డే వేడుకలకు ప్రతి ఏడాది విదేశీ అతిథులు హాజరు అవుతుంటారు. ఈ వేడుకల కోసం ఇండియా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సారి జరిగే 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ మెసియాస్ బోల్సోనారో హాజరు కానున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు బ్రెజిల్ నేతలు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి.