వేములవాడ రూరల్ MPTC ఎన్నికకు హైకోర్టు బ్రేక్

రాజన్నసిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండల MPTC ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వేములవాడ రూరల్ లో రిజర్వేషన్ల ప్రక్రియను మరోసారి పరిశీలించాలని.. ఆ తర్వాత ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ జరగలేదంటూ… పిటిషన్ ను ధాఖలు చేశారు వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేష్. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే వేములవాడ రూరల్ మండలానికి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ వేశారు. వేములవాడ రూరల్ మండలం MPTC, ZPTC ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టులో వాదనలు విన్పించారు లాయర్ తీగల రాంప్రసాద్. వాదనలు విన్న తర్వాత… వేములవాడ రూరల్ మండల ఎన్నికలపై హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Latest Updates