బ్రేకప్ జరగొద్దంటే.. ఇవి పాటించాలి

బ్రేకప్ … ఈ మాట ఒకప్పటికంటే ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. అది భార్యాభర్తల మధ్య కావొచ్చు.. ప్రేమికుల మధ్య కావొచ్చు.. తెగిపోయిన బంధానికి కొత్త పేరే బ్రేకప్ . ఈ విషయాన్ని కొంతమంది లైట్ గా తీసుకుంటే.. మరికొంతమంది ఎమోషనల్ గా తీసుకుంటున్నారు. అందుకే డిప్రెషన్, సూసైడ్స్ … అంటూ ఎన్నోరకాల వార్తలను రోజూ చూస్తున్నాం. ఇలాంటివి
జరగకూడదనుకుంటే… బ్రేకప్ పదాన్నే బ్రేక్ చేయాలి. దానికి చేయాల్సింది ఒక్కటే.. బంధం బ్రేక్ కాకుండా కాపాడుకోవాలి.

ఆడ, మగ మధ్య ఉన్న బంధాన్ని నిలబెట్టు కోవాలంటే.. వాళ్ల మధ్య ప్రేమ బలంగా ఉండాలి. ఎందుకంటే మిగతా విషయాలన్నీ ఆ ప్రేమతోనే మొదలవుతాయి. అయితే ఆకర్షణ, ఇన్ ఫాచ్యుయేషనే ప్రేమ అనుకుంటూ… జీవితాన్ని చేజేతులా పాడుచేసుకుంటోంది నేటి యువత. క్షణికావేశంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని .. బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అసలు ప్రేమ అంటే ఏంటో? ప్రేమను పెంచుకునే పనులేంటో తెలియక.. విడిపోవడానికి కారణమయ్యే పనులు చేస్తుంటారు. అసలు బంధాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

నిజాయితీ లేకపోవడం

మనుషుల మధ్య ఉన్న ప్రతి సంబంధానికీ నిజాయితీ అవసరం. నిజాయితీ లేని ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలవదు. ఇందుకు ప్రేమ కూడా మినహాయిం పు కాదు. ఒక జంట మధ్య గొడవలు మొదలవ్వడానికి, ప్రేమ విచ్ఛిన్నం కావడానికి నిజాయితీ లేకపోవడమే ముఖ్య కారణం.
బ్రేకప్ జరగొద్దంటే.. బ్రేకప్ … ఈ మాట ఒకప్పటికంటే ఈమధ్య కాలంలో బాగా వినిపిస్త ోంది. అది భార్యాభర్తల మధ్య కావొచ్చు.. ప్రేమికుల మధ్య కావొచ్చు.. తెగిపోయిన బంధానికి కొత్త పేరే బ్రేకప్ . ఈ విషయాన్ని కొం తమంది లైట్ గా తీసుకుంటే.. మరికొంతమంది ఎమోషనల్గా తీసుకుంటున్నారు. అందుకే డిప్రెషన్ , సూసైడ్స్… అంటూ ఎన్నోరకాల వార్తలను రోజూ చూస్తున్నాం. ఇలాంటివి జరగకూడదనుకుంటే… బ్రేకప్ పదాన్నే బ్రేక్ చేయాలి. దానికి చేయాల్సింది ఒక్కటే.. బంధం బ్రేక్ కాకుండా కాపాడుకోవాలి.

కమ్యూనికేషన్

నిజాయితీ తర్వాత ప్రతి రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన సంబంధం లేకపోతే ఆ రిలేషన్ షిప్ ఎక్కువ కాలం ఉండదు. ఒక సంబంధం ఎక్కువకాలం స్థిరంగా కొనసాగించడానికి.. ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ ని పెంచాలి. అలాగే
రిలేషన్ షిప్ లో ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నా ఈ కమ్యూనికేషన్ అవసరం. భాగస్వామితో ఎంత మాట్లాడితే సమస్యకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి.

ప్రయత్నం – సమయం

భాగస్వామితో గడపడానికి కావాల్సిన సమయం కోసం తప్పకుండా ప్రయత్నం చేయాలి. రిలేషన్ షిప్ కు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టడానికి సరైన సమయం లేనప్పుడు… విడిపోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు అర్థం. అందుకే భాగస్వామితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అప్పుడు ఇద్దరి మధ్య సమస్యలు కూడా రావు.

వ్యక్తిగత జోక్యం వద్దు

భాగస్వామితో ఎంత గాఢమైన ప్రేమలో ఉన్నప్పటికీ… పర్సనల్ స్పేస్ అవసరమవుతుంది. వాటిలో జోక్యం చేసుకున్నప్పుడు గొడవలు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడం కోసం.. ఇద్దరికీ చాలా విషయాల్లో అవగాహన కలిగి ఉండటం ముఖ్యం . పైగా జీవిత భాగస్వామి కోరికలు, వారి హక్కులను ఎప్పుడూ భంగపరచొద్దు. ప్రతి విషయంలోనూ పాలుపంచుకోవడం ప్రేమను బలపరుస్తుంది.

నిరాశ 

ప్రేమలో నమ్మకం కోల్పోవడానికి నిరాశ కూడా ముఖ్య కారణం. జీవిత భాగస్వామిపై విశ్వాసం ఉండాలి. ఏదైనా విషయంలో సందేహం ఉంటే..దాని గురించి వెంటనే చర్చించాలి. అప్పుడే ప్రేమను ఎప్పటికీ తగ్గించు కోలేరు. అలాగే అబద్ధం చెప్పడమూ బంధం విడిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి అలాం టివి లేకుండా చూసుకోవాలి. ఒకరు ఆశ పడ్డదాన్ని, కోరిన దాన్ని అవతలి వ్యక్తి తెచ్చిస్తే.. ఆ బంధం మరింత బలపడుతుంది.

Latest Updates