తాల్ అగ్నిపర్వతం చిమ్మిన బూడిదతో ఇటుకలు

ఫిలిప్పీన్స్ : పోగొట్టుకున్న చోటే మళ్లీ సంపాదిం చుకోవాలన్నది చాలా మంది చెప్పే మాట. ఆ మాటను నూటికి నూరుపాళ్లు నిజం చేసి చూపిస్తున్నారు ఫిలిప్పీన్స్ జనం. అవును, ఇటీవల అక్కడ తాల్ అగ్ని పర్వతం సృష్టించిన బీభత్సం గురించి తెలిసే ఉంటుంది కదా. కొన్ని లక్షల మందిని తమ తమ ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేసింది. దానికి సమీపంలోని ఊళ్లన్నింటినీ బూడిద మయం చేసింది. ఇప్పుడది తించడంతో జనం మళ్లీ తమ సొంతగూటికి వస్తున్నారు. అయితే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మళ్లీ లైఫ్ ను గెలవాలన్న సంకల్పంతో, తాల్ అగ్ని పర్వతం వదిలేసిన బూడిదనే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇటుకలను తయారు చేస్తున్నారు.

పనిలోపనిగా వాతావరణానికీ మేలు చేస్తున్నారు. అవును, అగ్నిపర్వత బూడిదను ప్లాస్టి క్ వేస్ట్​, సిమెంటు, ఇసుకతో కలిపి మంచి ఇటుకలను తయారు చేస్తున్నారు.వాటితో నే తమ ఇళ్లను మళ్లీ కట్టుకుంటున్నారు. అట్ల రోజూ 5 వేల వరకు ఇటుకలను తయారు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ‘‘పేరుకుపోయిన బూడిదను తీసి వేరేచోట పారబోయడం కంటే, దాని నుంచే ఏదైనా ఉపయోగపడే వస్తువును తయారు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఇది’’ అని బినాన్ సిటీ అధికారులు చెప్పారు. తాల్ వొల్కెనో ధాటికి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు బూడిద వెళ్లిందంటేనే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బినాన్ సిటీలో తయారు చేసిన ఇటుకలను బతంగస్ , కలకా, లెమరీ, అగోన్సి లో వంటి టౌన్లకు తరలిస్తామని చెబుతున్నారు.

see also: క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

ఇదే నా మొదటి ప్రేమలేఖ..

Latest Updates