రోడ్డు ప్రమాదంలో పెళ్ళికొడుకు మృతి… ఆగిన వివాహం

ఆరు రోజుల్లో పెళ్లి.. అంతలోనే వరుడు బైక్ ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెలితే.. కరీంనగర్ జిల్లా వీణవంక కు చెందిన సంతోష్ కు ఈ నెల 15న పెండ్లి జరుగనుంది. అయితే… తన వివాహానికి బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి ఆహ్వానించడానికి.. బైక్ పై గురువారం పెద్దపల్లికి బయలుదేరాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నీరుకుళ్ళ వద్ద ఇసుక ట్రాక్టర్ ను సంతోష్ బైక్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ మృతితో అటు వధువు ఇంట్లోనూ విషాదచాయలు అలుముకున్నాయి.

Latest Updates