పెళ్లి జరిగిన కాసేపటికే షాకిచ్చిన వధువు

పెళ్లి జరిగి కొన్నిగంటలు కూడా గడవకముందే నూతన వధువు అత్తింటి వారికి షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్, బడాన్ జిల్లాలోని చోటా పారా ప్రాంతంలో జరిగింది ఆ ఘటన. చోటాపారా ప్రాంతానికి చెందిన ప్రవీణ్, అజామ్‌ఘర్ ప్రాంతానికి చెందిన రియాలు డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. పెళ్లి వధువు ఊరైన అజామ్‌ఘర్‌లో జరిగింది. పెళ్లి తర్వాత అంతా కలిసి వరుడు ప్రవీణ్ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి రియా.. ప్రవీణ్ కుటుంబం మొత్తానికి మత్తుమందు ఇచ్చి ఇంట్లో ఉన్న నగదు, నగలతో పారిపోయింది. ప్రవీణ్ కుటుంబం మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి వధువు రియాతో పాటు నగదు మరియు విలువైన వస్తువులు కూడా కనిపించలేదు. దాంతో కంగుతిన్న ప్రవీణ్ కుటుంబం.. పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ శ్రీవాస్తవను కలిసి ఫిర్యాదు చేశారు. కొత్త పెళ్లి కూతురు రూ .70 వేల నగదు, మూడు లక్షల విలువైన ఆభరణాలతో పారిపోయిందని ఎస్పీ తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, వీలైనంత త్వరగా రియాను అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా.. పెళ్లికి మధ్యవర్తిత్వం చేసిన టింకు కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఎందుకంటే పెళ్లి తరువాత నుంచి టింకు కూడా కనిపించడం లేదు.

‘మేము ప్రవీణ్ పెళ్లి కోసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసాము. పెళ్లి కోసం ఇరుకుటుంబాలకు మధ్యవర్తిగా ఉన్న టింకు పెళ్లికి ముందే డబ్బు తీసుకున్నాడు. వధువు కుటుంబం చాలా పేదకుటుంబం. అందుకే వధువు దొంగతనం చేసింది. ఆ సొమ్ముతో ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం నగలను తయారుచేయిస్తారు’ అని వరుడు ప్రవీణ్ తండ్రి రామ్ లాడేటే అన్నారు.

‘నా భార్య నన్ను ఇలా మోసం చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా భార్య చేసిన పని వల్ల గ్రామంలో మా కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతోంది. అంతేకాకుండా మేము ఆర్థికంగా కూడా నష్టపోయాము. ఆమెను అరెస్టు చేయాలి’ అని వరుడు ప్రవీణ్ అన్నారు.

For More News..

50 పైసల కోసం తలుపులకు నోటీసులంటించిన బ్యాంకు సిబ్బంది

చీర కొంటే ఉల్లిగడ్డలు ఫ్రీ..

Latest Updates