భారీ వర్షాలతో వేములవాడలో కూలిన బ్రిడ్జి

వేములవాడలోని మూలవాగుపై నిర్మిస్తున్నబ్రిడ్జి శుక్రవారం ఉదయం కూలింది. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో మూల వాగు పొంగింది. దీని ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రిడ్జి కింద పెట్టిన సపోర్టు ఓరిగిపోయింది. దీంతో బ్రిడ్జి మధ్యలోకి కుంగి.. కాంక్రీటు, ఇనుప కడ్డీలు దెబ్బతిన్నాయి.

రూ.28 కోట్లతో బ్రిడ్జి పనులు చేపట్టింది ప్రభుత్వం. గత నాలుగేళ్లగా బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. నాసిరకం పనుల కారణంగానే బ్రిడ్జి కూలిందని తెలుస్తోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Latest Updates