మరిన్ని రిలీఫ్ ప్యాకేజీలు తీసుకురండి

 న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నుంచి దేశ ఎకానమీ బయటపడాలంటే ప్రజలు (హౌస్ హోల్డు), బిజినెస్ ల కోసం మరిన్ని రిలీఫ్ ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్  రఘురామరాజన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కోసం చేసే ఖర్చు తగ్గించకూడదని చెప్పారు. ప్రభుత్వం నుంచి రిలీఫ్ ప్యాకేజీలు రావడం ఆలస్యమైతే ఎకానమీ తిరిగి పుంజుకోవడం నెమ్మదిగా జరుగుతుందని రాజన్ అన్నారు. దీంతో వ్యాపారాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడం ఆలస్యం అవుతుందనారు.

భవిష్యత్తుపై అనిశ్చితితో ప్రజలు ఖర్చు చేయడం కంటే పొదుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. బుధవారం ఓ వెబినార్లో పాల్గొన్న రాజన్ ఈ విషయాలను పంచుకున్నారు. ‘రిలీఫ్ ప్యాకేజీలను ప్రకటించడం చాలా కీలకం. ఇవే లేకపోతే పరిస్థితులు మెరుగైనప్పుడు ఎకానమీ తిరిగి గాడిలో పడడం కష్టం అవుతుంది’ అని రాజన్ చెప్పారు. ద్రవ్యలోటు ఇండియాకు ఛాలెంజ్ గా ఉందని, మరింత స్లిమ్ములను ప్యాకేజీని ప్రకటించడానికి ప్రభుత్వానికి ఇదే అడ్డొస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Updates