కరాచీ విషయం తర్వాత.. ముందు పీవోకేను కలపండి చూద్దాం

ముంబై: పాకిస్తాన్‌‌లోని కరాచీని అఖండ భారత్‌‌లో కలిపే సమయం తప్పక వస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కరాచీ విషయం తర్వాత ముందు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను భారత్‌‌లో కలపడంపై దృష్టి పెట్టాలని బీజేపీకి రౌత్ చురకలంటించారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకురావడం పై బీజేపీ పని చేయాలి. ఆ తర్వాత కరాచీ గురించి మాట్లాడాలి. కశ్మీర్ మన చేతికొచ్చాక కరాచీకి వెళ్దాం’ అని రౌత్ పేర్కొన్నారు.

Latest Updates