కరోనాతో నటి మృతి

కరోనా వైరస్‌ సోకడంతో  బ్రిటిష్ నటి మృతి చెందారు. హిల్లరీ హెత్ (74) కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆమెకు చికిత్సను అందించారు డాక్టర్లు. అయితే ఆమె ఆరోగ్యం క్షిణించడంతో మరణించారు. వీరి మరణాన్ని ఆమె మనుమడు అలెక్స్ విలియమ్స్ మీడియాకు తెలిపాడు. హిల్లరీ హెత్ హారర్ సినిమాలకు ప్రత్యేకత.

అన్ ఆఫుల్ బిగ్ అడ్వెంచర్, హగ్ గ్రాంట్, అలాన్ రిక్ మ్యాన్,  గ్రే ఓల్డ్ మ్యాన్ అనే ప్రసిద్ద సినిమాలలో హిల్లరీ హెత్  నటించింది. వీరు లివర్ పూల్ నగరంలోని, ఇంగ్లండ్‌లో జన్మించారు. మిచేల్ రివీస్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.

యూకే లో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకు 73వేల మందికి కరోనా సోకగా, 8వేల 958 మంది మృతిచెందారని అక్కడి మీడియా తెలిపింది. వైరస్ సోకిన వారిలో రికవరీ అయిన వారి సంఖ్య అక్కడ చాలా తక్కువగా ఉంది.

Latest Updates