కరోనా డెత్ రిస్క్ చెప్పే నయా టూల్

డెవలప్ చేసిన బ్రిటిష్ రీసెర్చర్స్
లండన్: కరోనా పేషెంట్స్ డెత్ రిస్క్ ను తెలుసుకోవడానికి బ్రిటిష్ సైంటిస్టులు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఫోర్ లెవల్ స్కోరింగ్ మోడల్ ను అభివృద్ధి చేశారు. వైరస్ పేషెంట్స్ రిస్క్ ను త్వరగా గుర్తించి అందుకు అనుగుణంగా ట్రీట్ మెంట్ చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఈ టూల్ గురించిన వివరాలను బుధవారం పబ్లిష్ చేసిన బీఎంజే మెడికల్ జర్నల్ లో రీసెర్చర్స్ సవివరంగా చెప్పారు. కరోనా పేషెంట్స్ డెత్ రిస్క్ ను తక్కువ, మధ్యస్థం, ఎక్కువ, తీవ్ర ప్రమాదంగా వర్గీకరించారు. ఈ మోడల్ ను 4సీ (కరోనా వైరస్ క్లినికల్ క్యారెక్టరైజేషన్ కన్సార్టియం) మోర్టాలిటీ స్కోర్ గా పిలుస్తున్నారు.

4సీ మోర్టాలిటీ స్కోర్ రూపొందించడంలో భాగంగా కరోనా పేషెంట్స్ వయస్సు, బ్రీతింగ్, బ్లడ్ ఆక్సీజన్ లెవల్స్ లాంటి వివరాలను సేకరించారు. ఈ విధానం మిగిలిన 15 మోడల్స్ తో పోలిస్తే పేషెంట్స్ డెత్ రిస్క్ ను చాలా ప్రభావవంతంగా చూపించిందని రీసెర్చర్స్ పేర్కొన్నారు. ‘ఆరోగ్యం క్షీణించిన పేషెంట్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రీట్ మెంట్ కు సంబంధించి ఈ మోడల్ డాక్టర్లకు గైడ్ లా పనికొస్తుంది’ అని ఎడిన్ బర్గ్ వర్సిటీలో సర్జరీ, డేటా సైన్స్ విభాగాల్లో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ఎవెన్ హ్యారిసన్ తెలిపారు. 4సీ మోర్టాలిటీ స్కోర్ తక్కువగా ఉన్న పేషెంట్స్ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని, మీడియం లేదా హై రిస్క్ గ్రూపుల వారికి మరింత మెరుగైన వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్స్ లో ఉన్న వారికి అవసరమైతే స్టెరాయిడ్ డ్రగ్స్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Latest Updates