బ్రిటీష్ రాజకోట రహస్యాలు… సోషల్ మీడియాలో వైరల్

రాయల్ రహస్యాలు
బ్రిటిష్ రాజకుటుంబానికి సంబంధించిన ఏ వార్తయినా, ఒకప్పుడు పేపర్లో కచ్చితంగా వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఎందుకంటే కొన్ని శతాబ్దాలుగా క్వీన్ ఎలిజబెత్ కుటుంబ వారసులు పరిపాలకులుగా ఉన్నారు. అదంతా సరే ఇప్పుడు మాకెందుకు ఆ విషయం అంటారా? రెండో క్వీన్ ఎలిజబెత్ మనవరాలు ఎజీనీ విక్టోరియా ఇటీవలే తాను త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఎనౌన్స్ చేసింది. ఆ వార్తతో పాటు అసలు రాయల్ బర్త్‌ల హిస్టరీ ఏంటో తెలుసుకోవాలని చాలామంది గూగుల్ చేస్తున్నారట. అయితే మరి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం.

హోమ్ సెక్రటరీలు ఉండాలి
1948 వరకు రాజకుటుంబీకుల్లో ఎవరు ప్రసవించినా, ఆ టైమ్‌లో బ్రిటిష్ హోమ్ సెక్రటరీలు అటెండ్ కావాల్సిందే. 1930లో అప్పటి హోమ్ సెక్రటరీగా ఉన్న జాన్ రాబర్ట్ క్లిన్స్… ప్రిన్సెన్స్ మార్గరెట్ పుట్టుకకు సాక్షిగా స్కాట్‌ల్యాండ్‌కు ప్రయాణించారట. అప్పుడు డాక్టర్లు ఇచ్చిన డేట్ దాటి మరో రెండు వారాల తర్వాత మార్గరెట్ పుట్టింది. ఆ పదిహేను రోజులు జాన్ రాబర్ట్ స్కాట్ల్యాండ్లోనే ఉన్నాడు. అయితే ఈ ఆచారం క్వీన్ కజిన్ ప్రిన్సెస్ అలెగ్జాండ్రా పుట్టుకతో ఆగిపోయిందని చరిత్ర చెప్తోంది.

మిడ్‌వైవ్స్ అందరూ ఉండాలి
ఇప్పుడంటే అందరూ హాస్పిటల్స్‌లో డెలివరీ చేయించుకుంటున్నారు కానీ, అప్పట్లో ఇంట్లోనే అలా రాయల్ మదర్స్‌కి కూడా ఇంట్లోనే డెలివరీలు జరిగేవి. అయితే రాజకుటుంబానికి నమ్మకస్తులైన మంత్రసానులు, మెడికల్ టీమ్‌ని మాత్రమే పురుడు పోసేందుకు అనుమతించేవాళ్లు. ఎందుకంటే వాళ్లైతేనే రాయల్ బర్త్‌కి సంబంధించిన రహస్యాలను బయటికి తెలియనివ్వరని.

క్వీన్ విక్టోరియా సంతానం
బ్రిటిష్ రాజకుటుంబంలో మొదటిసారి డెలివరీ టైమ్‌లో మత్తు కోసం క్లోరోఫామ్ వాడిన రాణి.. క్వీన్ విక్టోరియా. ఆమెకు మొత్తం తొమ్మిదిమంది సంతానం. ఈమె వల్లే లండన్‌లో అనస్తీషియా గురించి చాలామందికి తెలిసింది.

హాస్పిటల్లో పుట్టింది అతనే
బ్రిటిష్ సంస్థానంలోనే మొదటగా హాస్పిటల్లో పుట్టింది ప్రిన్స్ విలియమ్. 1982, జూన్ 21న లండన్‌లోని సెయింట్ మేరీస్ హాస్పిటల్లో విలియమ్‌కి ప్రిన్సెస్ డయానా జన్మనిచ్చింది. అతని బర్త్ అనౌన్స్‌మెంట్‌ని డాక్టర్లు ఒక లెటర్‌పై సంతకం చేసి మరీ చెప్పారు. దాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ బయట గోల్డెన్ ఈగిల్‌కు అతికించారు.

జెండర్‌తో సంబంధం లేదు
రాజకుటుంబంలో పిల్లలు పుడుతున్నారంటే, అందరూ ఆలోచించేది వారసత్వం గురించే. బ్రిటిష్ మకుటం ఎవరికి వెళ్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎప్పుడూ ఆ వంశంలో పుట్టిన మగబిడ్డకు, అందులోనూ పెద్ద కొడుక్కి ఆ గౌరవం, స్థానం దక్కడమే చరిత్రలో చూశారు అందరూ. కానీ విలియమ్, కేట్ దంపతులు మాత్రం తమకు పుట్టిన ముగ్గురు పిల్లలను జెండర్ తేడా లేకుండా బర్త్ ఆర్డర్ ప్రకారంగా రాజమకుట స్థానానికి నిలబెట్టారు.

గ్రాండ్ అనౌన్స్మెంట్
కొన్నేళ్ల క్రితం వరకు ఎలిజబెత్ కుటుంబంలో ఎవరు పుట్టినా, ఆ అనౌన్స్‌మెంట్‌ని బకింగ్‌హామ్ ప్యాలెస్ బయట గోల్డెన్ ఈగిల్ (బంగారు నోటీస్ బోర్డ్) మీద రాసి పెట్టేవాళ్లు. దాన్ని ఇరవై నాలుగ్గంటల తర్వాత తీసేసేవాళ్లట. తర్వాతర్వాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఈ ఆచారం దూరమైంది.

Latest Updates