బ్రూక్ ఫీల్డ్ చేతికి జియో టవర్లు

  • డీల్‌ విలువ రూ.25 వేల కోట్లు
  • జియో చేతికి మరిన్ని నిధులు
  • ప్రత్యర్థి కంపెనీలకు చిక్కులే

న్యూఢిల్లీ: ప్రత్యర్థి టెల్కోలకు మరిన్ని సవాళ్లు విసరడానికి ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ టెల్కో జియో రెడీ అవుతోంది. టవర్ల వ్యాపారం నిర్వహించే రిలయన్స్‌ జియో ఇన్‌‌ఫ్రాటెల్‌ యూనిట్‌ ను కెనడాకు చెందిన బ్రూక్‌ ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీ దశలవారీగా సొంతం చేసుకోనుంది. ఇందుకోసం ఇది రిలయన్స్‌ కు చెందిన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ లో 25,215 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఇందులో టెలికం టవర్‌ కంపెనీకి 51 శాతం వాటాలు ఉన్నాయి. ఒప్పందం పూర్తయ్యాక టవర్‌ కంపెనీ పూర్తిగా బ్రూక్‌ ఫీల్డ్‌ , దాని భాగస్వాముల చేతికి వస్తుంది. టవర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ కు 1.70 లక్షల టవర్లు ఉన్నాయి. టవర్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో జియో అప్పులన్నీ తీర్చేయడంతో పాటు మిగులు నిధులు సమకూర్చుకుంటుంది. ఫలితంగా మరిన్ని ఆఫర్లతో ఎయిర్‌ టెల్‌ , వొడాఫోన్‌‌ ఐడియా కస్టమర్లను ఆకర్షించాలనేది జియో ప్లాన్‌‌. ఇండియాకు చెందిన ఇన్‌‌ఫ్రా సంస్థలో విదేశీ కంపెనీ ఇంత భారీగా ఇన్వెస్ట్‌ చేయడం ఇదే తొలిసారని జియో తెలిపింది.

ఫైబర్‌ ఆస్తులు కూడా…

బ్రూక్‌ ఫీల్డ్‌ కు టవర్లు అమ్మిన విధంగానే జియో డిజిటల్ ఫైబర్‌ ను కూడా అమ్మేయడానికి రిలయన్స్‌ప్రయత్నిస్తోంది. ఫైబర్‌ అసెట్స్‌ కొనబోయే ఇన్వెస్టర్ల పేర్లను మాత్రం కంపెనీ బయటపెట్టలేదు. టవర్‌ ,ఫైబర్‌ వ్యాపారాలను జియో నుంచి గత ఏడాదే వేరు చేశారు. టవర్ల వ్యాపారం అమ్మకానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రియల్‌ ఇన్వ-స్ట్‌ మెంట్స్ అండ్‌ హోల్డింగ్‌ బ్రూక్‌ ఫీల్డ్‌ అనుబంధ సంస్థ బీఐఎఫ్‌ ఐవీ జర్విస్‌‌, దీని భాగస్వాముల కోసం ట్రస్టులో యూనిట్లను జారీ చేస్తుంది. స్పాన్సర్‌ గానూ వ్యవహరిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ కో–స్పాన్సర్‌ అవుతుంది. దీనికి యూనిట్లు ఉండవు. జియో ఇన్‌‌ఫ్రాటెల్‌ లో ట్రస్టుకు ప్రస్తుతం 51 శాతం,రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. నిధులు వచ్చాక, ట్రస్టు రిలయన్స్‌ కు చెందిన 49శాతం వాటాలను కొంటుంది. రూ.12 వేల కోట్లకు జియోకు తిరిగి చెల్లిస్తుంది. ఇన్‌‌ఫ్రాటెల్‌ అప్పులు తీర్చే బాధ్యత కూడా తీసుకుంటుంది. టవర్ల సంస్థ అభివృద్ధికి ఇన్వెస్ట్‌ కూడా చేస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ వర్గాలు తెలిపాయి. ట్రస్టు నుంచి అందిన రూ.12 వేలకోట్లతో అప్పులు తీర్చడానికి వాటిని జియో రిలయన్స్‌ గ్రూపునకు బదలాయిస్తుంది. ఈ డీల్‌ పూర్తయిన తరువాత జియో ఇన్‌‌ఫ్రాటెల్‌ కు ఇంకా రూ.16 వేలకోట్ల అప్పు ఉంటుంది.

గ్యాస్‌‌ పైప్‌ లైన్‌ ను సైతం…

రిలయన్స్‌ లో బ్రూక్‌ ఫీల్డ్‌ కు ఈ ఏడాదిలో ఇది రెం డోఇన్వెస్ట్‌ మెంట్‌ . ఈ ఏడాది మార్చిలో ఇది రిలయన్స్గ్యాస్‌‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ను కొనడానికి అంగీకరించింది. ఈస్ట్‌ వెస్ట్‌ పైప్‌ లైన్‌‌గా పిలిచే ఈ ప్రాజెక్టు నష్టాల్లో కొనసాగుతోంది. ఎంటర్‌ ప్రైజ్‌ వాల్యుయేషన్‌‌ రూ.12 వేల కోట్ల వరకు ఉంది.‘‘బ్రూక్‌ ఫీల్డ్‌ నుంచి భారీగా నిధులు రావడం వల్ల జియో బ్యాలన్స్‌ సీట్‌ బలోపేతమవుతుంది. నగదు నిల్వలు పెరుగుతాయి. ఎయిర్‌ టెల్‌ , వొడాఫోన్‌‌ ఐడియాతో మరింత గట్టిగా పోరాడుతుంది.మొబైల్‌ బ్రాడ్‌ బ ్యాండ్‌ విభాగంలో మరింత వృద్ధిసాధిస్తుంది’’ అని ఎనలిసిస్‌‌ మేన్షన్‌‌కు చెందిన రోహన్‌‌ ధమీజా అన్నారు . టవర్ల వ్యాపారాన్నిఅభివృద్ధి చేసి బ్రూక్‌ ఫీల్డ్‌ కు అమ్మేశామని, ఫైబర్‌ విషయంలో నూ ఇదే జరుగుతుందని రిలయన్స్‌ సీఎఫ్‌ ఓ శ్రీకాంత్‌ అన్నారు . అయితే ఈ రెంటినీ వాడుకునేందుకు జియోకు హక్కు ఉంటుంది.ఇందుకోసం ట్రస్టుకు డబ్బులు చెల్లిం చామని అన్నారు. జియోకు ఏడు లక్షల కిలోమీటర్ల మేరఫైబర్ నెట్‌ వర్క్ ఉంది. ఎయిర్‌ టెల్‌ , వొడాఫోన్‌‌ ఐడియా కూడా టవర్ల యూనిట్లలో షేర్లను అమ్మే ఆలోచనలో ఉన్నాయి.

Latest Updates