సిరిసిల్లలో అన్నాచెల్లెళ్ల పోటీ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్​ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల పోరు అందరినీ ఆకర్షిస్తోంది. సిరిసిల్ల మున్సిపల్​పరిధిలోని 16వ వార్డులో టీఆర్ఎస్​పార్టీ తరఫున గుజ్జ తార కౌన్సిలర్​గా పోటీ చేస్తుండగా, అన్న గుడ్ల శ్రీనివాస్​స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య పోటీ సరికాదని నాయకులు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో నామినేషన్ల ఉపసంహరణ గడుపు ముగిసిన అనంతరం వీరు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Latest Updates