బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం

బ్రదర్‌ అనిల్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బ్రదర్ అనిల్ కుమార్ కారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ దగ్గరకు రాగానే అదుపు తప్పి ఫుట్ పాత్ నుంచి రోడ్డు  పక్కకు దూస్కెళ్లింది. ఘటన జరిగిన సమయంలో అనిల్ కుమార్ తో పాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌కు ఉన్నారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను ఘటనా స్థలానికి చేరుకున్నారు .  సామినేని కారులో వారిని విజయవాడలోని ఎంజే ఆస్పత్రికి తరలించారు.  ప్రథమ చికిత్స తర్వాత బ్రదర్‌ అనిల్‌ అక్కడి నుంచి తన పర్యటనకు వెళ్లిపోయారు.

Latest Updates