అన్నానేను చచ్చిపోతున్నా: నా ఫ్యామిలీ జాగ్రత్త..ఢిల్లీ ప్రమాద బాధితుడి ఫోన్ కాల్

అన్నా నేను చచ్చిపోతున్నా…నా ఫ్యామిలీ జాగ్రత్త అంటూ ఢిల్లీ అనాజ్ మండీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు చివరి నిమిషంలో తన అన్నతో జరిపిన  ఫోన్ సంభాషణ ప్రతీ ఒక్క హృదయాల్ని ద్రవించి వేస్తుంది.

ఢిల్లీ ఝాన్సీరాణి రోడ్ లో ఇరుకైన మూడంతస్థుల భవనంలో బ్యాగులు, బాటిళ్లు తయారు చేసే వ్యాపార సముదాయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో 43మంది మృతి చెందినట్లు సమాచారం.

షార్ట్ సర్క్యూట్ తో కార్మికులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

ప్రమాదంతో భవనంలోని కార్మికులు తమ ప్రాణాల్ని రక్షించాలని ఆర్తనాదాలు చేస్తుంటే..అందులో ఓ కార్మికుడు తన ప్రాణం కంటే తన ఫ్యామిలీ గురించే ఆలోచించాడు.

మరో రెండు, మూడు నిమిషాల్లో ప్రాణాలు పోతాయని తెలిసినా ఉత్తర్ ప్రదేశ్ బిజినోర్ కు చెందిన ముషారఫ్ అలీ తన అన్నకు ఫోన్ చేశాడు.

నిమిషాల్లో తనని మృత్యువు కబళించి వేస్తుందని తెలియడంతో  ముషారఫ్ అలీ కుటుంబం గురించే ఆలోచించాడు.

ఎక్కడో ఉన్న తన అన్నకు ఫోన్ చేసి..అన్నా నేను చనిపోతున్నా. నా కుటుంబసభ్యులు జాగ్రత్త. దేవుడి దయుంటే బ్రతుకుతా. నేను చనిపోయిన విషయాన్ని ఇంట్లో చెప్పు అంటూ జరిపిన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది.

Latest Updates