రామ్ మందిర్ కోసం 151 నదుల నీటిని తెచ్చిన అన్నదమ్ములు

ఆగస్టు 5న అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్నారు. ఆలయ నిర్మాణం కోసం చాలామంది దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని మరియు పవిత్ర నదుల నీటిని తీసుకొస్తున్నారు. అయోధ్యలో రాముడి దేవాలయ నిర్మాణం కోసం దేశంలోని కోట్లాది మంది హిందువులు వేచి చూస్తున్నారు.

రామ్ మందిర్ నిర్మాణంలో తమ వంతుగా యూపీకి చెందిన ఇద్దరు అన్నాదమ్ములు 151 నదుల నుంచి నీటిని తీసుకువచ్చారు. రాధే శ్యామ్ పాండే మరియు మహాకవి త్రిఫల అనే ఇద్దరు అన్నదమ్ములు రాముడి మీద భక్తితో పలు ప్రాంతాలలోని పవిత్ర నదుల నుంచి నీటిని సేకరించారు. గంగా, యమునా మరియు సరస్వతి నదులతో పాటు మరికొన్ని పుణ్య నదుల నుంచి ఈ నీటిని తీసుకొచ్చారు. అలాగే 11 విభిన్న ప్రదేశాల నుంచి మట్టిని కూడా తీసుకొని అయోధ్యకు చేరుకున్నారు. అయితే వీరిలో మహాకవి త్రిఫల చిన్నప్పటి నుంచి చూడలేరు. ఆయన పుట్టు అంధుడు.

ఈ విషయం గురించి రాధే శ్యామ్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని 151 నదులు, 8 పెద్ద నదులు, 3 సముద్రాల నుంచి ఈ నీటిని తీసుకువచ్చాను. అలాగే శ్రీలంకలోని 16 ప్రదేశాల నుంచి పవిత్ర మట్టిని, 5 సముద్రాలు మరియు 15 నదుల నుంచి నీటిని తీసుకువచ్చాను. వీటి కోసం కాలినడకన, సైకిల్ మీద, రైలులో, విమానంలో ప్రయాణించి ఇవన్నీ సేకరించాను. వీటి కోసం 1968లో మొదలుపెట్టి 2019 వరకు సేకరించాను’ అని తెలిపారు.

For More News..

కర్ఫ్యూ టైంలో షాపు తీసినందుకు రూ. 25 వేల లంచం డిమాండ్

కరోనాతో ఉత్తరప్రదేశ్ సాంకేతిక విద్యా మంత్రి మృతి

పంజాబ్ లో దారుణం.. కల్తీ మద్యం తాగి 86 మంది మృతి

అయోధ్య భూమి పూజకు అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

Latest Updates