ఆ తప్పుచేస్తే చంపేస్తారు : బ్రూనైలో క్రూరమైన పీనల్ కోడ్ అమలు

తెలుసుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే శిక్షలు అవి. అలాంటి శిక్షల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బ్రూనై దేశం.  బ్రూనై సుల్తాన్.. హసానల్ బొల్కియా.. అత్యంత కఠినమైన షరియా పీనల్ కోడ్ ను అమలులోకి తెచ్చారు. వ్యభిచారం చేసినా.. ప్రకృతి విరుద్ధంగా శృంగారం చేసినా… గే సెక్స్ లో పాల్గొన్నా… నేరస్తులను రాళ్లతో కొట్టి చంపేస్తారు. దొంగతనాలు చేస్తే చేతులు, కాళ్లు నరికేస్తారు.

ఆయిర్ సమృద్ధిగా ఉన్న దేశం బ్రూనై. హసానల్ బొల్కియా ఈ దేశాన్ని మోనార్క్ లా పాలిస్తున్నారు. ఆయన వయస్సు 72 ఏళ్లు. ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం ఓ దేశాన్ని పరిపాలించిన వారిలో రెండోవాడుగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా రికార్డులకెక్కారు.

ఆయన రాజరిక పాలన ఆ దేశంలో 51 ఏళ్లుగా కొనసాగుతోంది.  ముస్లిం షరియా చట్టాలను అనుసరించి… కఠినమైన చట్టాన్ని అక్కడి పాలకులు 2013లో తీసుకొచ్చారు. కానీ.. అమలులో కఠినంగా వ్యవహరించలేదు. ఇప్పటినుంచి…. ఎట్టి పరిస్థితుల్లో కొత్త పీనల్ కోడ్ ను తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ కొత్త చట్టం ముస్లింలకు ఎక్కువగా వర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో నాన్ ముస్లింలు దీని పరిధిలోకి వస్తారు. అత్యాచారం, వ్యభిచారం, అసాంఘిక శృంగారం, దోపిడీ, ప్రాఫెట్ మహమ్మద్ ను అవమానించడం.. లాంటి నేరాలు చేస్తే.. ఈ కఠినమైన శిక్షలు అమలవుతాయి.

అబార్షన్(కడుపు తీయించుకోవడం) చేసుకుంటే బహిరంగంగా కొరడాలతో కొడతారు.

దొంగతనం చేస్తే కాళ్లు లేదా చేతులు నరికేస్తారు.

స్ట్రాంగెస్ట్ ముస్లిం కంట్రీగా మార్చే ఉద్దేశంతో హసానల్ బొల్కియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి.

Latest Updates