‘బీఎస్‌‌‌‌‌‌‌‌ 6’ బండ్లు వచ్చేస్తున్నయ్‌‌‌‌‌‌‌‌

  • వచ్చే ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నుంచే మార్కెట్లోకి కొత్త వెహికల్స్‌
  • అప్పటినుంచి ‘బీఎస్‌ 4’కు రాం రాం, నోరిజిస్ట్రేషన్‌
  • కాలుష్యం తగ్గించే ప్రయత్నం
  • ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ తర్వాత పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరల పెంపు?

తక్కువ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసే ‘బీఎస్‌‌‌‌‌‌‌‌ 6 (భారత్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌-6)’ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ త్వరలో రోడ్లమీదకు రానున్నాయి. ప్రస్తుతమున్న బీఎస్‌‌‌‌‌‌‌‌ 4 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ఇకపై కనుమరుగుకానున్నాయి. కేంద్రం నిర్ణయం మేరకు 2020 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ ఒకటి నుంచి బీఎస్‌‌‌‌‌‌‌‌ 6 బండ్లే అమ్ముతారు. ఈ వెహికల్స్‌‌‌‌‌‌‌‌తో పొల్యుషన్‌‌‌‌‌‌‌‌ తగ్గనుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే బీఎస్‌‌‌‌‌‌‌‌ 6 బండ్ల రోడ్డెక్కాక పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. వెహికిల్స్‌‌‌‌‌‌‌‌ రేట్లూ పెరుగుతాయి.

పొల్యూషన్‌‌‌‌‌‌‌‌ తగ్గించే బీఎస్‌‌‌‌‌‌‌‌ 6 వెహికల్స్‌‌‌‌‌‌‌‌

బీఎస్‌‌‌‌‌‌‌‌-6 వాహనాల్లో ఎగ్జాక్ట్స్‌‌‌‌‌‌‌‌(పొగ గొట్టం) కాస్త డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా తయారు చేస్తారు. ఫిల్టర్‌‌‌‌‌‌‌‌, లేయర్స్‌‌‌‌‌‌‌‌తోపాటు ఇంజన్‌‌‌‌‌‌‌‌లోనూ మార్పులు చేయాలి. అందుకు వాహన తయారీ సంస్థలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాలుష్యం తగ్గించేందుకు కొన్ని ప్రత్యేకమైన నిబంధనలూ పాటించాలి. ఇప్పుడున్న బీఎస్‌‌‌‌‌‌‌‌-4 వెహికల్‌‌‌‌‌‌‌‌ 50 పీపీఎం (పార్ట్స్‌‌‌‌‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌ మిలియన్‌‌‌‌‌‌‌‌) సల్ఫర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తే, బీఎస్‌‌‌‌‌‌‌‌-6 వెహికల్‌‌‌‌‌‌‌‌ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. బీఎస్‌‌‌‌‌‌‌‌-4తో పోల్చితే బీఎస్‌‌‌‌‌‌‌‌-6 వాహనాల్లో నైట్రోజన్‌‌‌‌‌‌‌‌ ఆక్సైడ్‌‌‌‌‌‌‌‌ విడుదలను 5 రెట్లు తగ్గించొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 15 లక్షల బీఎస్‌‌‌‌‌‌‌‌ 4 వాహనాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

‘సుప్రీం’ ఆదేశాలతో..

భారత్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌ -1 ప్రమాణాలు 2000లో మొదలయ్యాయి. 2010 నుంచి దేశంలో బీఎస్‌‌‌‌‌‌‌‌ 3 నిబంధ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను అమ‌‌‌‌‌‌‌‌లు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బీఎస్‌‌‌‌‌‌‌‌ 4 వాహనాలు నడుస్తున్నాయి. ఢిల్లీలో పెరుగుతున్న పొల్యూషన్‌‌‌‌‌‌‌‌పై దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను విచారించిన సుప్రీంకోర్టు.. కాలుష్యం తగ్గించే కొత్త బండ్లు తేవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌1 నుంచి బీఎస్‌‌‌‌‌‌‌‌ 4 వాహనాలు అమల్లోకి వచ్చాయి. అదే క్రమంలో బీఎస్‌‌‌‌‌‌‌‌ 5 లేకుండా నేరుగా బీఎస్‌‌‌‌‌‌‌‌ 6 వాహనాలు ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ మేరకు 2020 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి బీఎస్‌‌‌‌‌‌‌‌ 4 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ అమ్మడం, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఆపేస్తున్నారు.

రెడీ అవుతున్న కంపెనీలు

పలు కంపెనీలు ఇప్పటికే బీఎస్‌‌‌‌‌‌‌‌-6 వెహికల్స్‌‌‌‌‌‌‌‌ తయారీ ప్రారంభించేశాయి. కొన్ని ఆటోమొబైల్ తయారీదారులు ఇప్పటికే ఇతర దేశాల నుంచి దిగుమతికి ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ కంటే నెల ముందే బీఎస్‌‌‌‌‌‌‌‌ 6 గ్రేడ్‌‌‌‌‌‌‌‌ ఇంధనాన్ని సిద్ధం చేయనున్నట్లు ఆయిల్‌‌‌‌‌‌‌‌ కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ ధరల పెంపు?

బీఎస్‌‌‌‌‌‌‌‌ 6 వాహనాల్లో వాడే డీజిల్‌‌‌‌‌‌‌‌, పెట్రోల్‌‌‌‌‌‌‌‌ను ఇంకాస్త ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా కంపెనీలపై అదనంగా రూ.30,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. దీంతో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ తర్వాత లీటరుపై రేటు రెండు రూపాయల వరకు పెరిగే అవకాశముంది.

Latest Updates