డ్రగ్స్, ఆయుధాలను పంపే కుట్రను అడ్డుకున్న బీఎస్ఎఫ్

జమ్మూ: పాకిస్తాన్ నుంచి ఇండియాకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నార్కోటిక్స్‌‌ను పంపేందుకు యత్నించిన టెర్రరిస్టుల యత్నాలను బీఎస్ఎఫ్ విఫలం చేసింది. జమ్మూ డివిజన్ ఆర్ఎస్ పురా సెక్టార్‌‌కు 198 కిలో మీటర్ల దూరంలోని ఇంటర్నేషనల్ బార్డర్‌‌‌ వెంబడి పాక్‌‌లోని అర్నియా నుంచి మాదక ద్రవ్యాలను తరలించే జరిగిందని సమాచారం. ఓ పైపు ద్వారా తరలిస్తున్న 62 డ్రగ్స్ ప్యాకెట్లు, రెండు పిస్టల్స్, నాలుగు మేగజీన్లు బుధవార్ పోస్ట్ వద్ద ఆదివారం ఉదయం 2 గంటల సమయంలో స్వాధీనం చేసుకున్నామని జమ్మూ బీఎస్ఎఫ్ ఐజీ ఎన్‌‌ఎస్ జమ్వాల్ తెలిపారు. బుధ్‌‌వార్, బుల్లెఛక్ పోస్టుల్లో బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో అక్కడ నలుగురు పాకిస్తానీలను గుర్తించారు. వాళ్లు తమపై ఫైరింగ్‌‌కు దిగారని, ఎదురుకాల్పులు చేయడంతో తప్పించుకొని పారిపోయారని జమ్వాల్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌‌లో నార్కో టెర్రరిజంను పెంపొందించేందుకు డ్రగ్స్, డబ్బులను హవాలా మార్గంలో పంపుతూ పాకిస్తాన్ కుట్రకు పాల్పడుతోందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు.

Latest Updates