బోర్డర్లో తప్పిపోయిన బాలుడ్ని అప్పగించిన్రు

బోర్డర్లో తప్పిపోయిన బాలుడ్ని అప్పగించిన్రు

అనుకోకుండా పంజాబ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ మూడేళ్ల పాకిస్తానీ చిన్నారిని బీఎస్ఎఫ్  అధికారులు పాకిస్థాన్ రేంజర్ల సహకారంతో ఆ బాలుడిని తల్లి ఒడికి చేర్చారు.  ఈ ఘటన శనివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఫిరోజ్‌పూర్ సెక్టర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు దగ్గర పిల్లవాడు ఏడుస్తున్నట్లు బీఎస్ఎఫ్ సిబ్బంది గమనించారు. దీంతో బీఎస్ఎఫ్ ఫీల్డ్ కమాండర్ పాకిస్థానీ రేంజర్స్‌తో తక్షణమే ఫ్లాగ్ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. అ తర్వాత ఆ బాలుడిని తన తండ్రి సమక్షంలో రేంజర్స్‌కు అప్పగించారు.