టెక్ అప్‌గ్రేడేషన్‌కు‌ బీఎస్‌ఎఫ్ గ్రీన్‌ సిగ్నల్‌.. 436 డ్రోన్‌ల కొనుగోలు!

టెక్ అప్‌గ్రేడేషన్‌కు‌ బీఎస్‌ఎఫ్ గ్రీన్‌ సిగ్నల్‌.. 436 డ్రోన్‌ల కొనుగోలు!

న్యూఢిల్లీ: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్​)కు ఫుల్ టైమ్ డైరెక్టర్‌ జనరల్‌గా రాకేశ్ ఆస్థానా రీసెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎఫ్​ టెక్నలాజికల్ అప్‌గ్రేడేషన్‌పై ఆయన ఫోకస్ చేశారు. సరిహద్దు పహారా కోసం 436 స్మాల్, మైక్రో డ్రోన్స్‌ కొనుగోలుకు ఆయన అనుమతి ఇచ్చారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌‌, పంజాబ్‌ల్లో టెర్రరిస్టులకు చెందిన ఏవైనా డ్రోన్స్‌ కనిపిస్తే వాటిని పేల్చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్‌ టెస్టింగ్‌కు కూడా ఆదేశించారు. పంజాబ్‌లోని పాకిస్తాన్‌ బార్డర్‌‌లో ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలతో కలసి బీఎస్‌ఎఫ్‌ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను టెస్ట్‌ చేస్తోందని సమాచారం.

కాంప్రహెన్సివ్ ఇంటెగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ (సీఐబీఎం) ప్లాన్ కింద పాకిస్తాన్‌తోపాటు బంగ్లాదేశ్ బార్డర్‌‌లో పహారా కాసే 1,923 బీఎస్‌ఎఫ్‌ ఔట్‌పోస్టుల్లో సెన్సార్స్, సీసీటీవీ, డ్రోన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. బార్డర్‌‌లో డ్రోన్‌లతో రెక్కీ నిర్వహించడం, పేలోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కనిపిస్తే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌తో పేల్చేసేలా బీఎస్‌ఎఫ్‌ వ్యూహాలు పన్నుతోంది. మినిస్ట్రీ ఆఫ్​ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్‌ఏ) అధికారుల ప్రకారం.. స్మాల్, మైక్రో డ్రోన్‌కు అయ్యే ఖర్చు సుమారు రూ.88 కోట్లని తెలిసింది.