BSNL బంపర్ ఆఫర్: రూ.999కే సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్

BSNLప్రభుత్వ రంగ టెలికాం సంస్థ… భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశ వ్యాప్తంగా ఉన్న తన ప్రీపెయిడ్ వినియోగదారులకోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.999కే  కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు ఏడాది పాటు అన్‌లిమిటెడ్ మొబైల్ డేటా లభిస్తుంది. అలాగే 181 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. జమ్మూ కశ్మీర్, అస్సాం, ఈశాన్య భారత రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని BSNL  మొబైల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని BSNL తెలిపింది. అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1GB వరకు మొబైల్ డేటా మాత్రమే ఫ్రీగా లభిస్తుంది. కానీ ఏడాదిపాటు మొబైల్ డేటాను పొందవచ్చు. అంటే మొత్తం ఏడాదికి కలిపి రోజుకు 1GB డేటా చొప్పున మొత్తం 365 GB డేటా ఈ ప్లాన్ ద్వారా వస్తుంది. ఇదే ప్లాన్ జియో, ఎయిర్‌టెల్‌లలో లభిస్తుండగా, వాటికి 60 GB డేటాను 90 రోజుల వాలిడిటీతో మాత్రమే అందిస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates