రోజుకు 10 GB డేటాతో BSNL బంపర్ ఆఫర్

టెలికం రంగంలో పోటీ పెరిగిపోవడంతో తమ వినియోగదారులకు ఆయా సంస్థలు ఆకట్టుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా జియో నుంచి పోటీ ఎక్కువ కావడం..మిగతా టెలికం సంస్థలు కూడా భారీగా ఆఫర్లు ప్రైవేటు కంపెనీల పోటీ మార్కెట్లో ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ రంగ సంస్థ BSNL కూడా  సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. రెండు ప్లాన్లలో రోజు 10GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ వాడుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

రూ.96తో రీచార్జీ చేసుకుంటే 28 రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్, 10GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. అలాగే రూ.236తో రీచార్జ్ చేస్తే 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్, 10GB డేటా అందివ్వనుంది. అయితే ఈ అవకాశం 4G యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ప్రస్తుతం ఈ అవకాశాన్ని కొన్ని ప్రాంతాల్లో వినియోగించుకునే అవకాశం కల్పించింది BSNL.

Latest Updates