BSNL  బంపర్ ఆఫర్

ప్రభుత్వ రంగ సంస్థ  భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) తన చందాదారులకు అద్భుత ఆఫర్‌ తీసుకొచ్చింది.  పండుగ సీజన్ సందర్భంగా  ప్లాన్‌ను BSNL రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్‌ ప్లాన్‌పై  90 రోజులు అదనంగా ఫ్రీ డేటా అందించనుంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు  మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తించనున్నట్లు  సంస్థ తెలిపింది.

రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి  ఈ ప్లాన్‌ వాలిడిటీ 365 రోజులు మాత్రమే. దీంతోపాటు అక్టోబర్‌ నెలలో రోజుకు 3.5 GB డేటాను అందిస్తోంది. నవంబరు, డిసెంబర్‌ నెలల్లో రోజుకు 3 GB డేటా అందిస్తుంది.  రోజుకు 2 GB డేటాతో పాటు రోజుకు 250 నిమిషాలు కాలింగ్,  రోజువారీ 100 SMS ఉచితం. అక్టోబర్ 31 లోపు  రీచార్జ్‌ చేసుకున్న కస‍్టమర్లకు 90 రోజుల  అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి.

Latest Updates