స్థలం కబ్జాపై కాలనీ వాసుల ధర్నా

హైదరాబాద్: రోడ్డును ఆక్రమించి కడుతున్న అక్రమ నిర్మాణాన్ని తొలగించాలంటూ  బుద్దానగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ఆదివారం కాలనీలోని  కబ్జా అయిన స్థలం వద్ద టి ఆర్ ఎస్ పార్టీ మూడవ డివిజన్ నాయకులు మద్ది యుగంధర్  రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు.ఈ  సందర్భంగా యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ..  అక్రమంగా ఉన్న రోడ్డు కబ్జా చేయాలని చూస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కబ్జా విషయంపై అధికారులకు ఎన్ని సార్లు వినతి పత్రం ఇచ్చిన స్పందించలేదని పేర్కొన్నారు.

ఈ రోడ్డు మూసి వేతను తొలగించినట్లైతే మెయిన్ రోడ్డుకు వెళ్లే దారి సులువవుతుందని ఆయన అన్నారు. ఈ రోడ్డు మూసివేత వెనకాలే మిషన్ భగీరథ లో వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. రోడ్డు తొలగింపు వల్ల ఇక్కడి నుండి వాటర్ పైపు లైన్ వేసినట్లైతే గత కొన్ని ఏండ్లుగా బుద్దానగర్ కాలనీ వాసులు పడుతున్న నీటి కష్టాలు తీరుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అక్రమ రోడ్డు నిర్మాణం తొలగించే వరకు తమ ధర్నా కొనసాగిస్తామని, పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,మహిళలు పాల్గొన్నారు.

Latest Updates