జాబ్‌‌ కొట్టే స్కిల్‌‌ పెంచుతం

కోటి మంది యువతకు ట్రైనింగ్‌‌ ఇస్తం: సీతారామన్‌‌

న్యూఢిల్లీ: ‘మున్ముందు చాలా దేశాల్లో లేబర్‌‌ కొరత ఉంటుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా, ఓవర్‌‌సీస్‌‌లో జాబ్‌‌లు సంపాదించేలా మన యువతను తీర్చిదిద్దుతాం. వాళ్లలో నైపుణ్యాలు పెంచుతాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ చెప్పారు. ప్రధానమంత్రి కౌశల్‌‌ వికాస్‌‌ యోజన ప్రోగ్రామ్‌‌ ద్వారా దాదాపు కోటి మంది యువతకు ట్రైనింగ్‌‌ ఇస్తామన్నారు. దేశంలో స్కిల్డ్‌‌ మ్యాన్‌‌ పవర్‌‌ను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా ‘కాయకవే కైలాస (వర్క్‌‌ ఈజ్‌‌ వర్షిప్‌‌)’ అంటూ ఉద్యోగ బాధ్యతలను గుర్తు చేశారు. ఎక్కువ జీతమిచ్చే జాబ్‌‌లను కూడా యువత సంపాదించేలా న్యూ ఏజ్‌‌ స్కిల్‌‌ పెంచేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆర్టిఫిషీయల్‌‌ ఇంటెలిజెన్స్‌‌, ఇంటర్నెట్‌‌ ఆఫ్‌‌ థింగ్స్‌‌, బిగ్‌‌ డేటా, 3డీ ప్రింటింగ్‌‌, వర్చువల్‌‌ రియాలిటీ, రోబోటిక్స్‌పై యువతకు ట్రైనింగ్‌‌ ఇప్పిస్తామని చెప్పారు.

 

Latest Updates