బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండవు: లక్ష్మణ్

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్  TRS పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పటికంటే.. గత ఆరేళ్లలో కేంద్రం ఏడు రెట్ల నిధులు ఇచ్చిందని తెలిపారు. నిజాయతీ ఉంటే దీనిపై  మంత్రి కేటీఆర్  చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదని కేటీఆర్ అనడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రాల వారీగా ఉండవన్నవిషయాన్ని గుర్తించాలన్నారు. మీ జేబులు నింపుకోవడానికి కేంద్రం నిధులు కేటాయించదని…టీఆర్ ఎస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్. అంతేకాదు కేటీఆర్ గల్లీ మాటలు మాట్లాడటం మానుకోవాలన్నారు.

Latest Updates