బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ: న్యాయం చేశామన్న అధికార పార్టీ

KCR Says We Will Give Two Minister Posts For Women

బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అన్ని రంగాలకు న్యాయం చేశామని అధికార పార్టీ నేతలు అంటుంటే .. అంకెల గారడీ చేశారని కాంగ్రెస్ విమర్శించింది. బడ్జెట్ పై పలు అభ్యంతరాలు చెబుతూనే సర్కార్ కు సూచనలు చేశారు టీడీపీ, బీజేపీ సభ్యులు. బడ్జెట్ ఆమోదం పొందడంతో సోమవారం ద్రవ్య వినిమియ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.

రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బడ్జెట్ పద్దులపై విపక్ష సభ్యుల సందేహాలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కేసీఆర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ ను ఆమోదించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, సీఎం తరుపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టిన జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు చర్చ లేకుండానే అసెంబ్లీ ఆమోదం లభించింది.

అంతకుముందు బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ జరిగింది. అంకెల గారడీ చేశారని విమర్శించిన కాంగ్రెస్ సభ్యులు.. నిధులు, కేటాయింపులకు పొంతన లేదన్నారు. అయితే పంచాయతీలకు నిధులు ఇవ్వలేదన్న శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై సీఎం సీరియస్ గా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పైరయ్యారు. పంచాయతీలకు 40 వేల కోట్లు కేటాయించామని, అద్దాల్లాంటి గ్రామాలు తయారు చేసి చూపిస్తామన్నారు సీఎం.

సాగునీరు, గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు సంతోషమన్నారు సబితా ఇంద్రారెడ్డి. కాళేశ్వరంలాగే పాలమూరు ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేయాలన్నారు. రెండోదఫా రైతు బంధు నిధులు చాలా మందికి రాలేదన్నారు సబితా.

పేదల అభివృద్ధి కోసం సర్కార్ పాటుపడాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కొన్ని ప్రాంతాల్లో పేదలకు ఇండ్లు లేవన్నారు. ఖాళీగా ఉన్న దేవాదాయ భూమి పేదలకు ఇవ్వాలన్నారు.

ఎన్నికల హామీలను సర్కార్ నెరవేర్చాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. మంచిపనులు చేస్తే తమ మద్దతు ఉంటుందన్నారు. సత్తుపల్లిని కూడా జిల్లా చేయాలని సండ్ర విన్నవించారు.

ప్రజల ఆకాంక్షల నెరవేర్చేలా ప్రభుత్వం బడ్జెట్ తెచ్చిందన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. రాష్ట్రం మారినా…విమర్శలు మారటం లేదన్నారు. దేశానికే రోల్ మోడల్ గా రాష్ట్రం తయారైయిందన్నారు.

ఇక సభ ప్రారంభం కాగానే మాజీ గవర్నర్ ఎన్డీ తివారీతో పాటు ఇటీవలే చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సభ్యులు సంతాపం తెలిపారు. సోమవారం ద్రవ్య వినిమియ బిల్లుపై సభలో చర్చ జరగనుంది.

Latest Updates