బడ్జెట్​ హల్వా రెడీ

ఈ సారి బడ్జెట్‌‌ పేపర్లను ప్రింట్ చేయడం లేదు. డిజిటల్‌‌ కాపీలనే పార్లమెంట్‌‌ సభ్యులకు షేర్​ చేయాలని కేంద్రం  నిర్ణయించింది. అందుకోసం స్పెషల్​గా డిజైన్​ చేసిన ‘యూనియన్‌‌ బడ్జెట్‌‌ మొబైల్‌‌ యాప్‌‌’ ను ఫైనాన్స్‌‌ మినిస్టర్‌‌‌‌ నిర్మలా సీతారామన్‌‌ శనివారం లాంచ్ చేశారు. బడ్జెట్‌‌కు ముందు ట్రెడిషనల్‌‌గా వస్తున్న ‘హల్వా తయారీ’ని కూడా చేపట్టారు.

బడ్జెట్ కోసం యాప్‌‌‌‌ లాంచ్ చేసిన నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  ఫిబ్రవరి 1 న ప్రవేశ పెట్టబోయే కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ సభ్యులు యాక్సెస్‌‌‌‌‌‌‌‌ చేసుకునేందుకు  ‘యూనియన్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌’ ను ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌ శనివారం లాంచ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ యాప్‌‌‌‌‌‌‌‌ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. కరోనా వలన ఈ సారి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ పేపర్లను ప్రింట్ చేయడం కంటే డిజిటల్‌‌‌‌‌‌‌‌గానే పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ సభ్యులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఈ కొత్త యాప్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని అంశాలు..

1) ఈ యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా మొత్తం 14 యూనియన్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్లను యాక్సెస్ చేయొచ్చు. వీటిలో యాన్యువల్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌(బడ్జెట్‌‌‌‌‌‌‌‌), డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఫర్ గ్రాంట్స్(డీజీ), ఫైనాన్స్ బిల్లు వంటివి అందుబాటులో ఉంటాయి.

2) ఈ యాప్‌‌‌‌‌‌‌‌లో డౌన్‌‌‌‌‌‌‌‌లోడింగ్‌‌‌‌‌‌‌‌, ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌, సెర్చ్‌‌‌‌‌‌‌‌, జూమ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌, జూమ్‌‌‌‌‌‌‌‌ అవుట్‌‌‌‌‌‌‌‌, కిందకి పైకి స్క్రోలింగ్‌‌‌‌‌‌‌‌, టేబుల్‌‌‌‌‌‌‌‌ కంటెంట్స్‌‌‌‌‌‌‌‌, ఎక్సటర్నల్‌‌‌‌‌‌‌‌ లింక్స్‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లుంటాయి.

3) ఇంగ్లీష్‌‌, హిందీ భాషల్లో ఉన్న ఈ యాప్‌‌‌‌‌‌‌‌, ఆండ్రాయిడ్‌‌‌‌‌‌‌‌, ఐఓఎస్‌‌‌‌‌‌‌‌ రెండు ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లలో అందుబాటులో ఉంది.

4) www.indiabudget.gov.in పోర్టల్‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎకనామిక్‌‌‌‌‌‌‌‌ ఎఫైర్స్‌‌‌‌‌‌‌‌(డీఈఏ) గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ కింద నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేటిక్స్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఎన్‌‌‌‌‌‌‌‌ఐసీ) ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసింది.

5) ఫిబ్రవరి 1 న ఫైనాన్స్ మినిస్ట్రీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ స్పీచ్‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాక, బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రిలేటడ్ డాక్యుమెంట్లు ఈ యాప్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి వస్తాయి.

‘హల్వా’ తయారైంది..

బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు ముందు ట్రెడిషనల్‌‌‌‌‌‌‌‌గా వస్తున్న ‘హల్వా తయారీ’ని శనివారం ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. హల్వా తయారీ తర్వాత బడ్జెట్‌‌‌‌‌‌‌‌ తయారీ,  ప్రింటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లుంటాయి. బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ప్రవేశ పెట్టేంత వరకు దీని తయారీలో పాల్గొన్న వారిని లాక్‌‌ ఇన్‌‌ చేస్తారు. కాగా, ఈ సారి బడ్జెట్ మొత్తం డిజిటల్‌‌‌‌‌‌‌‌ యాప్ ద్వారా జరగనుంది. ఇండెపెండెన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాక మొదటి సారిగా బడ్జెట్ పేపర్లను ప్రభుత్వం ప్రింట్ చేయడం లేదు.

For More News..

ఆ ఆరుగురు ప్లేయర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్​

బంపర్ ఆఫర్.. వేయి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

థ్యాంక్యూ ఇండియా.. థ్యాంక్యూ మోడీ!

Latest Updates