వీడియో వైరల్: గుంపుగా వచ్చి సింహాలను గడగడలాడించాయి

న్యూఢిల్లీ: ఐకమత్యం మహా బలం అనే నానుడి వినే ఉంటారు. అందరూ ఒక్కటైతే దేన్నయినా సాధించొచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ నానుడి కింది వీడియోకు సరిగ్గా సరిపోతుంది. అడవి రాజైన సింహాలను గేదెల మంద తరిమిన సదరు వీడియో నెట్‌‌లో వైరల్ అవుతోంది. వివరాలు.. అడవిలో నిర్జన ప్రాంతంలో కొన్ని సింహాలు తిరుగాడుతున్నాయి. అదే సమయంలో అటు వైపుగా గేదెల మంద దూసుకొచ్చింది. గేదెలు అక్కడికి చేరుకోగానే సింహాలు భయపడి పరుగును అందుకున్నాయి. వీడియో చివర్లో సింహాలను గేదెల మంద తరుముతుండటాన్ని చూడొచ్చు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఐకమత్యంతో అద్భుతాలు స‌ృష్టించొచ్చని, ఇలాంటి యాటిట్యూడ్ చాలా ముఖ్యమని వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, అందరినీ భయపెట్టే సింహాలను గేదెల మంద పరిగెత్తించిన వీడియోను ఆలస్యం చేయకుండా చూసేయండి.

Latest Updates