490.. కారు స్పీడు రికార్డు

అతివేగం ప్రమాదకరం’.. ‘స్పీడ్​ థ్రిల్స్​.. బట్​ కిల్స్​’.. ‘వేగం ప్రాణాలకు యమపాశం’.. ఇవీ అతివేగం గురించి మనం వినే, చూసే నినాదాలు. కొంచెం సేపు వాటిని పక్కనబెడదాం. అదే వేగం రికార్డులనూ బద్దలుకొట్టేస్తుంది. ఈ కారు చూశారుగా. భూమ్మీద దీనికన్నా స్పీడ్​గా పోయే కారు లేదంటే నమ్ముతారా! కానీ, అది నిజం. గంటకు ఓ వంద, 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తేనే ఆహా ఓహో అనుకుంటాం. కానీ, ఇది గంటకు 490 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. కళ్లుమూసి తెరిచేలోగా మన ముందు నుంచి మాయమైపోతుంది.

దీనిపేరు బుగాటి షిరాన్​. జర్మనీలోని ఫోక్స్​వ్యాగన్​ ఈరా లెషియన్​ టెస్ట్​ ట్రాక్​పై దీని స్పీడ్​ను టెస్ట్​ చేశారు. ఆండీ వాలేస్​ అనే డ్రైవర్​ కారును 490 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైన కారుగా రికార్డు సృష్టించింది. ఈ హైస్పీడ్​ కార్లను బుగాటి ఎక్కువగా తయారు చేయదట. ఆర్డర్​ మీద కొద్ది మంది కోసం మాత్రమే వీటిని తయారు చేస్తుందట. సుమారు ₹21.7 కోట్లు దీని ఖరీదు. మరి, అంత స్పీడ్​ అంటే సేఫ్టీ కూడా తెరపైకి వస్తుంది కదా. ఆ మాట రావొద్దనే స్పీడ్​కు తగ్గట్టుగా కారు బాడీని తయారు చేశారు. టైర్లను మిషెలిన్​ ప్రత్యేకంగా తయారు చేసింది.

Latest Updates