
చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు
బీజింగ్: కరోనా పుట్టిల్లు చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగానే పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు ఐదు రోజుల్లో హాస్పిటల్ కట్టింది. సౌత్ బీజింగ్‌లో 1500 గదులతో ఈ హాస్పిటల్ కట్టినట్లు లోకల్ మీడియా ప్రచురించింది. హెబ్బీ ప్రావిన్స్‌లోని నాన్గాన్లో ఇంకో హాస్పిటల్ కడుతున్నారు. 6,500 రూములతో దీన్ని నిర్మిస్తున్నామని, అది వారంలో పూర్తవుతుందని అధికారులు చెప్పారు. సౌత్ బీజింగ్‌లో, నాన్గాన్ సిటీల్లో కేసులు ఎక్కువగా పెరుగుతున్న క్రమంలో ఈ చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు. చైనా గతంలో కూడా ఇలాంటి చర్యలే చేపట్టింది. 2019లో వూహాన్లో కరోనా కేసులు బయటపడినప్పుడు కూడా వారంలో అతిపెద్ద ఐసోలేషన్ హాస్పిటల్‌ను నిర్మించింది.
For More News..