కూలిన 4అంతస్తుల బిల్డింగ్.. శిథిలాల కింద 40మంది!

ముంబైలో భవన ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. డోండ్రీ ఏరియాలోని కేసర్ బాయ్ బిల్డింగ్ కూలిపోయింది. ఈ భవనం శిథిలాల కింద 40 మంది చిక్కుకుని ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది.

భవనం కూలిన స్థలంలో అధికారులు, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల తొలిగింపును వేగంగా చేస్తున్నారు. శిథిలాల కింద వెలికితీసినవారికి వెంటనే వైద్యం అందించేలా ఘటనా స్థలానికి మొబైల్ అంబులెన్స్ ను తీసుకొచ్చారు అధికారులు.

ఇటీవల కురిసిన భారీవర్షాలే భవనం కూలిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ముంబైలో పాత భవనాలకు ఇప్పటికే హెచ్చరికలు చేశారు అధికారులు.

Latest Updates