ఎయిర్ టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్

ఎయిర్ టెల్ యూజర్లకు శుభవార్త తెలిపింది ఎయిర్‌టెల్. టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌ రూ.199ను లేటెస్టుగా సవరించింది. ఈ కొత్త ప్లాన్ లో భాగంగా యూజర్లు మరింత డేటాను పొందవచ్చని తెలిపింది. కొత్త రూ.199 ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెలికాం సర్కిల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. త్వరలో మిగతా యూజర్లకు తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వినియోగదారులు రూ.199 ప్లాన్ కింద రోజూ 1GB డేటాను పొందగా.. ఇప్పుడు వారికి రోజూ 1.5 GB డేటా లభించనుంది.

ఎయిర్ టెల్  యూజర్లు 1.5 GB రోజువారీ డేటా కోటాతో పాటు రోజుకు 100 SMS లు, అన్ లిమిటెడ్ కాలింగ్ సేవలను అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజుల వరకు ఉంటుంది. రీఛార్జ్‌తో పాటు ఎయిర్‌టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్, హెలోట్యూన్‌లను యాక్సెస్ చేయవచ్చు. యూజర్లు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ఫ్రీ సేవలను కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ అందిస్తుంది. రూ.249 కింద రోజుకు 1.5 GB డేటాను, 100 SMS, 28 రోజుల కాలానికి అపరిమిత కాలింగ్ సేవలను కూడా అందిస్తుంది. రెండు ప్లాన్‌లు ఒకే విదంగా ఉండటంతో..దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ త్వరలో రూ.249 ప్లాన్‌లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

Latest Updates