బుమ్రాపై ప్రశంసంల వర్షం..

ముంబై ఇండియన్స్‌ బౌలర్‌, యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై ప్రశంసంల వర్షం కురుస్తోంది.పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తన శక్తిపైనే ఫోకస్‌పెట్టి బౌలింగ్‌ చేసే బుమ్రా రాజస్థాన్‌ తో మ్యాచ్‌ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ కనబర్చాడని సహచరుడు క్రునాల్‌ పాండ్యా అతడిని పొగడ్తల్లో ముంచెత్తాడు. ‘బుమ్రా లెజెండ్‌ లాగా బౌలింగ్‌ చేశాడు. ఐపీఎల్లో అయినా.. టీమిండియా తరఫునైనా బుమ్రా చక్కటి బౌలింగ్‌ చేస్తాడు.  అతడో ఔట్‌ స్టాండింగ్‌ ప్లేయర్‌. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ లో అతడి బౌలింగ్‌ ను ఎంత పొగిడినా తక్కువే’ అని అన్నాడు. మరోవైపు తనసోదరుడు హార్దిక్‌‌ గురించి మాట్లాడుతూ.. ఈఏడాది హార్దిక్‌‌ బంతిని చక్కగా బాదగలుగుతున్నాడని పేర్కొన్నాడు. రెండో మ్యాచ్‌ లోనే విజయం సాధించడంతో టీమ్‌‌ లయను అందుకునే అవకాశముంటుందని క్రునాల్‌ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన బుమ్రా ‘ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. నా బలాలపైనే ఫోకస్‌ చేస్తా. ప్లాన్స్‌ కు అనుగుణంగా బౌలింగ్‌ చేసుకుంటూ వెళ్తా. ఫిట్‌ నెస్‌ విషయంలో కఠినంగా ఉంటా కాబట్టే మంచి ఫలితాలు వస్తున్నాయి’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

Latest Updates