బాద్షాకు బుర్జ్ ఖలీఫా విషెస్

బాద్ షా.. షారూక్ ను అభిమానులు ముద్దు గా పిలుచుకునే పేరు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు. దేశ సరిహద్దు లనూ దాటేసేంత అభిమానం. అందుకు నిదర్శనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పింది. బిల్డింగ్ పై లైట్లతో షో చేసింది. అంతేకాదు, బిల్డింగ్ చుట్టు పక్కల ఉన్న ఫౌంటెయిన్లతో ఆయనకు మస్తు మస్తు గౌరవం ఇచ్చింది. చుట్టూ ఉన్న జనం ఎంతో ఆసక్తిగా ఆ షోను చూశారు. నవంబర్ 2న బాలీవుడ్ బాద్ షా షారూక్ 54వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ప్రముఖుల నుంచి ఆయనకు విషెస్ వెల్లువెత్తా యి. బుర్జ్ ఖలీఫా కూడా ఇలా విషెస్ చెప్పి , బాద్ షాపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఆ వీడియోను షారూక్ ట్వీట్ చేశారు. బుర్జ్ ఖలీఫా, ఆ బిల్డింగ్ ను కట్టిన ఎమార్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని ట్వీట్ చేశారు.

Latest Updates