ఆర్టీసీ బస్సు-లారీ ఢీ : ఇద్దరు మృతి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాసరావుతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన దగ్గర ట్రాఫిక్ జామైంది. బస్సు ఢీకొనడంతో లారీలోని ఐరన్ లోడు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో.. గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఏలూరు ప్రభుత్వ హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates