ప్రైవేట్ బస్సు బోల్తా..30 మందికి తీవ్ర గాయాలు

ప్రైవేట్ బస్సు బోల్తాపడ్డ ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉదయం కృష్ణా జిల్లాలో జరిగింది. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రమణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర అదుపుతప్పి బస్సు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నవారిలో 30మందికి గాయాలయ్యాయి. యానం నుంచి హైదరాబాదు వెళుతుండగా బస్సు ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు ప్రయాణికులు.

గాయాలైన వారిలో పదిమంది చిన్నారులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. గాయపడ్డవారిని నందిగామ ప్రభుత్వ హస్పిటల్ కి తరలించారు. ఇందులో ముగ్గురు చిన్నారుల పరిస్ధితి విషమంగా ఉండటంతో విజయవాడకు తరలించినట్లు తెలిపారు పోలీసులు.

 

Latest Updates