
రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగి ఆరుగురు చనిపోగా.. మరో 17 మంది గాయపడ్డారు. జలూర్ జిల్లాలోని మహేశ్పురలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అజ్మీర్‌లోని బేవార్‌కు చెందిన 40 మంది జైన భక్తులు ఓ ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకొని నాకోడలోని జైన దేవాలయాన్ని సందర్శించి బేవార్‌కు తిరిగి వస్తున్నారు. రాత్రి సమయం కావడంతో బస్సు డ్రైవర్ రూట్ తప్పిపోయి.. వేరే గ్రామంలోకి వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక తప్పుడు రూట్లో వెళ్తున్నామని గ్రహించి.. బస్సును వెనుకకు మళ్లించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో రోడ్డు మీద వైర్లు కిందికి ఉండటంతో బస్సుకు తగిలాయి. దాంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా ఆరుగురు మరణించగా.. మరో 17 మంది గాయపడ్డారని జలూర్ అదనపు జిల్లా కలెక్టర్ చాగన్ లాల్ గోయల్ తెలిపారు. గాయపడిన వారిని జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.
For More News..